సేవల్లో మేటి మహేష్ ఆపదలో ఆపన్న హస్తం

సేవల్లో మేటి మహేష్
ఆపదలో ఆపన్న హస్తం

అంబరానంటిన్న
మహేష్ బర్త్ డే వేడుకలు

సామాజిక సేవాతపస్వి
ఐదేళ్లుగా ఎన్నో సేవలు

మిత్రులు, అభిమానులు
మహేష్ యువసేన
రక్తదాన శిబిరాలు

జిల్లాలో యువ నాయకుడు

మహేష్ కు ప్రత్యేక గుర్తింపు

నారాయణపేట, అక్షిత ప్రతినిధి :

సేవల్లో మేటిగా మహేష్ పేరొందాడు. చిన్న పెద్ద నోట మహేష్ చెరగని ముద్ర. ఆపదలో ఆపన్న హస్తం. ఐదేళ్లుగా ఎన్నో సామాజిక సేవలు చేస్తూ పేద ప్రజల హృదయాల్లో మహేష్ సుస్థిర స్థానాన్ని పదిల పెంచుకున్నాడు. మహేష్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో 9వ వార్డు మాజీ కౌన్సిలర్, అంబేద్కర్ జిల్లా జాతర కమిటీ అధ్యక్షులు యు. మహేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

యువ నాయకుడు మహేష్ జన్మదినం వచ్చిందంటే చాలు మహేష్ యువసేన ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు ఉంటాయని అనుకోవాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తారు .ప్రతి సంవత్సరం మిత్రులు, అభిమానులు కలిసి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేద రోగులకు పండ్లు, భోజనం పంపిణీ చేస్తారు.

మహేష్ జన్మదినం సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో, పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా, ఫుట్బాక్, గుర్మత్కల్ తదితర గ్రామాల నుంచి యువకులు అభిమానులు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభిమానులు, మిత్రుల మధ్య సేవ కార్యక్రమంలో యువ మహేష్ పాల్గొని నిర్వహిస్తారు.

అలాగే ఈ సంవత్సరం కూడా మహేష్ 4 అంగన్వాడీ స్కూల్ లో చిన్న పిల్లలకు పలకలు, బుక్స్, చాక్లేట్, ప్లేట్స్, గ్లాస్ లు పంపిణీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్, అన్నదానం అందించారు. యువకులు అందరూ ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.అలాగే నారాయణపేటలోని వివిధ గ్రామాలలో మహేష్ జన్మదినని పురస్కరించుకొని గ్రామాలలో స్టేజ్ వేసి చిన్నపిల్లలకు బహుమతులను ప్రదానం చేశారు.నారాయణ పేట జిల్లా లోని వివిధ గ్రామాల నుండి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.కర్ణాటక నుండి కూడా మహేష్ ఆత్మీయులు ఫ్రెండ్స్, అభిమానులు పెద్ద ఎత్తున నారాయపేటకు వచ్చి పెద్ద పులమలతో శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల యువకులు, చుట్టు పక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనాలు వచ్చి యు.మహేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.తన రాజకీయ ప్రస్థానంలో కూడా ఇలాగే దూసుకుపోవాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking