రూ.50 లక్షలతో
పేదలకు చేయూత
ప్రతిష్టాత్మకంగా భీష్మరాజ్
ఫౌండేషన్ సేవలు
ఘనంగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్
డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
*పలు దేవాలయలు సందర్శించి ప్రత్యేక పూజలు
* విద్యార్థులకు, వృద్ధులకు
* సేవా కార్యక్రమాలు*
* చేనేత కార్మికులు,ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత
* శివాజీ విగ్రహంకు
* 2 లక్షల అడ్వాన్స్*
* నారాయణపేటలో
* భీష్మ రాజ్ ఫౌండేషన్ అభిమానులు భారీ బైక్ ర్యాలీ
నారాయణపేట,అక్షిత ప్రతినిధి :
పేదలకు చేయూత నందించేందుకు రూ.50 లక్షలు హెచ్చించి భీష్మరాజ్ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. పేదలు, అభాగ్యులకు అండగా నిలవడంతో పాటు యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పలు సామాజిక అంశాల్లో తోడుగా నిలవడం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సామాజిక సృహ విశేషం. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు నారాయణపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం వీరభద్రేశ్వర స్వామి, భీమ శంకర ఆలయం లక్ష్మమ్మ దేవాలయాలను కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులతో కలిసి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం వేద ఆశీర్వాదాలు అందజేశారు.జన్మదినం సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులకు మిఠాయిల పంపిణీ చేశారు. అదే విధంగా ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పండ్లు పంపిణీ చేశారు.

సామాజిక సేవలో ముందంజలో ఉన్న భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు, అభిమానులు, యువకులు కలిసి నారాయణపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ డా.రాజ్ కుమార్ రెడ్డి చిత్రపటంతో ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా సాగి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇక చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ, విద్యార్థులకు చదువుల కోసం ఆర్థిక సహాయం, పలు దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం ద్వారా ఫౌండేషన్ తన సేవా భావాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిలిపింది.

ఆటో కార్మికులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా చేయూత అందించారు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు 2 లక్షల అడ్వాన్స్, బీఫార్మసీ విద్యార్థికి, ఫౌండేషన్ కుటుంబ సభ్యుల విద్యా అవసరాల కోసం ఆర్థిక సహాయం,ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు బోర్ల ఏర్పాటు కొరకు, విద్య, వైద్య రంగాల్లో సహాయం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం సుమారు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేశారు. భీష్మ రాజ్ ఫౌండేషన్ సభ్యులు, అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి ఛైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డితో కట్ చేయించారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా.కె.రాజ్ కుమార్ రెడ్డి సేవా కార్యక్రమాలను ప్రజలు ప్రశంసిస్తూ,ఆయన మరింతగా సామాజిక సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.