జూబ్లీహిల్స్ లో ఘనవిజయం ఫణిగిరిలో సంబరాలు
ప్రజాస్వామ్యం సంక్షేమానికి ప్రజల పట్టం
అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రజలకు నమ్మకం
ప్రజలు అభివృద్ధి రాజకీయాలకే ఓట్లు వేశారు
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి
నాగారం అక్షిత న్యూస్ :- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించడం నేపథ్యంలో మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా బాణాసంచాలు పేల్చి, మిఠాయిలు పంచుతూ గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన అపారవిశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం అని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి, అభివృద్ధి రాజకీయాలకు మరోసారి గట్టి మద్దతు తెలిపారని అన్నారు. ఈ విజయం హైదరాబాద్ పట్టణంలోనే కాదు, మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని, ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే మళ్లీ అధికారం అప్పగించే సమయం ఆసన్నమైందనే సంకేతాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు. వల్లాల నవీన్ యాదవ్ యువతకు ఆశా కిరణం అని, యువతకు ఉపాధి, ప్రజలకు సంక్షేమం, పేదలకు న్యాయం, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా అందించే నాయకత్వాన్ని అందించే నాయకుడని తెలిపారు. నవీన్ యాదవ్ ప్రజాసేవకు అందుబాటులో ఉండే స్వభావం, సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చిత్తశుద్దె ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని కొనియాడారు. నవీన్ యాదవ్ గెలుపు తమ సొంత విజయంగా భావించి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలల్లో రాష్ట్రవ్యాప్తంగా విజయ డంఖా మ్రోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతికి కట్టుబడి పనిచేస్తుందని, ప్రజల సమస్యలు ఏవైనా వాటిని వినడానికి, పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర యాదగిరి, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి, ఎండోమెంట్ చైర్మన్ గట్టు లక్ష్మీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాతి వెంకన్న, వి. వెంకట్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. భాను ప్రకాష్, బి. కరుణాకర్, కె. రమేష్ ఆర్. సత్తయ్య, ఎం. వెంకన్న, శేఖర్ రెడ్డి, భాస్కర్, వెంకన్న, రామయ్య, రమేష్, జయరాం తదితరులు పాల్గొన్నారు.