జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఘనవిజయంతో..
గండి మైసమ్మ చౌరస్తాలో
కాంగ్రెస్ పార్టీ పటాకులతో సంబరాలు..
కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి నాయకత్వంలో..
మేడ్చల్, అక్షిత బ్యూరో:
దుండిగల్ పురపాలక పరిధి గండి మైసమ్మ చౌరస్తాలో,జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు.

అనంతరం కిషోర్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎంత సోషల్ మీడియా ను నమ్మి దుష్ట ప్రచారం చేసిందో ప్రభుత్వం పై జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు బిఆర్ఎస్ కు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఏ.ఆర్ సాధు యాదవ్, సర్పంచుల పోరం మాజీ అధ్యక్షులు దుండిగల్ మున్సిపల్ గ్రామ మాజీ సర్పంచ్ కావలి గణేష్, ఆకుల ప్రేమ్ కుమార్ ముత్యం రెడ్డి రచ్చ నాయక్, మైనార్టీ నాయకులు అధ్యక్షులు అక్బర్ భాయ్, కాజా భాయ్, గజేంద్ర, మల్లేష్ యాదవ్,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు..