అనాథ బిడ్డకు పెళ్లి
ఆశీర్వదించిన తూడి
ఆశ్రమ నిర్వాహకులకు
ఎమ్మెల్యే అభినందన
వనపర్తి, అక్షిత ప్రతినిధి :
వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులోని చేయూత అనాధాశ్రమంలో ఆదివారం నిర్వహించిన వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2004 సంవత్సరం అనాధగా ఆశ్రమంలో చేరిన మాధవి పెరిగి పెద్దదయింది ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి దంపతులు అమ్మాయికి జటప్రోలు గోపులాపురం గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి తో వివాహం నిర్వహించారు. ఆదివారం అనాధాశ్రమంలో నిర్వహించిన ఈ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనాధలను చేరదీసి వారి బాగోగులు చూసుకుంటూ భవిష్యత్తు బాగును కోరి వివాహం జరిపిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, చిన్నమందడి మాజీ సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, అంకుర్ వెంకటరెడ్డి, ఆర్యభవన్ శ్రీనివాస్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఆదిత్య కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, లక్కాకుల సతీష్, సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.