దాతృత్వం చాటుకున్న   ఎమ్మెల్యే మేఘారెడ్డి

దాతృత్వం చాటుకున్న
  ఎమ్మెల్యే మేఘారెడ్డి

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం
అనాధాశ్రమానికి ఆసరా

రూ.6 లక్షల విలువ గల
  వాహనo వితరణ

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన

అన్నదాశ్రమ నిర్వాహకులు

వనపర్తి, అక్షిత ప్రతినిధి :

దాతృత్వం పరిఢవిల్లింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చిట్యాల చేయూత అనాధాశ్రమానికి తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు సాయిరెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం రూ.6 లక్షల
విలువ గల వాహనాన్ని అందించారు. కన్న తల్లిదండ్రులను సరిగా చూసుకొని ఈ రోజుల్లో తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆశ్రమానికి వాహనాన్ని అందించి ఎమ్మెల్యే తన గొప్ప మనసును చాటుకున్నారని చేయూత అనాధాశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. చేయూత అనాధాశ్రమం నుంచి గ్రామాలలోని అనాధ వృద్ధులకు భోజనాన్ని అందించేందుకు ఈ వాహనాన్ని ఉపయోగించినట్లు నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. మానవత్వం గల ఇలాంటి గొప్ప నాయకులు కలకాలం ప్రజాసేవలోనే ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, చిన్నమందడి మాజీ సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, అంకుర్ వెంకటరెడ్డి, ఆర్యభవన్ శ్రీనివాస్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఆదిత్య కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, లక్కాకుల సతీష్, సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking