విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ ఉద్యోగుల
సమస్యల పరిష్కారానికి కృషి

సంఘం డివిజన్ సెక్రటరీగా కొండేటి అశోక్, అధ్యక్షులుగా కొండల్ నాయక్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎస్టీ, ఎస్సీ యూనియన్ నల్గొండ సర్కిల్ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్, చిట్యాల రాజులు కోరారు. శనివారం మిర్యాలగూడ డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం పనితీరు, ముగిసిన పాలక వర్గం, కొత్త కార్యవర్గం ఎంపిక, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సంఘం మిర్యాలగూడ డివిజన్ కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం డివిజన్ అధ్యక్షులుగా కొండల్ నాయక్, సెక్రటరీగా కొండేటి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎ.బిక్షం, వైస్ ప్రెసిడెంట్ గా ఎం.కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా ఎ.జనార్దన్, డివిజన్ ఆర్గనైజర్ గా రవి నాయక్, డివిజన్ ట్రెజరర్ గా ఎం.ఆంజనేయులు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రవి కుమార్, ఏఈ అమర్ సింగ్ సంఘ సభ్యులు హాజరయ్యారు.

సంఘం పనితీరు
మెరుగు పర్చుతా

కొండేటి అశోక్

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ సంఘం పనితీరును మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎస్టీ, ఎస్సీ యూనియన్ మిర్యాలగూడ డివిజన్ సెక్రటరీ కొండేటి అశోక్ అన్నారు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పనిచేసి వన్నె తెస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking