బాచుపల్లిలో మిన్నంటిన సంబరాలు

ప్రజా పాలన ప్రభుత్వానికి పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ప్రజలు..

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కు ఘనవిజయంతో 

బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు..

మేడ్చల్, అక్షిత బ్యూరో:
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం యందు ఘనంగా, టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని అంటే ఎలా జరుపుకున్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో జూబ్లీహిల్స్ లో ప్రజా పాలన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని సంక్షేమ పథకాలే ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వం చేపడుతుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలిపారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఘనంగా సంబరాలు చేసుకున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking