బీసీ జాగృతి సేన, జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ ధర్మ దీక్ష

బీసీ జాగృతి సేన, జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ ధర్మ దీక్ష

స్థానిక ఎన్నికలలో, విద్య, ఉద్యోగాలలో,42 % రిజర్వేషన్లు అమలు
చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

పేట మాజీ మార్కెట్ కమిటీ
చైర్మన్ బండి వేణుగోపాల్*

*దీక్ష ప్రారంభంలో మహా ప్రజా కవి కీర్తి శేషులు అందెశ్రీ కి మౌనం*

నారాయణపేట, అక్షిత ప్రతినిధి :

నారాయణ పేట జిల్లా కేంద్రం లో మున్సిపల్ పార్క్ దగ్గరా ఆర్ కృష్ణయ్య,బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూరుపల్లి కృష్ణ యాదవ్ ఆదేశాల ప్రకారం బీసీ జాగృతి సేన,బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల కుర్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సామాజిక న్యాయధర్మదీక్ష కార్యక్రమంలో ముందుగా కీర్తి శేషులు ప్రజాకవి అందెశ్రీకి రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం ముఖ్యఅతిథిగా బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల లో,విద్య, ఉద్యోగాలలో చట్టబద్ధతతో కూడిన 42 శాతం రిజర్వేషన్ ఇచ్చకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని లేకుంటే బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించాడు. ఈ కార్యక్రమానికి మద్దతుగా మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్, మాట్లాడుతూ బీసీల ఉద్యమం తెలంగాణ ఉద్యమం ల సాగాలని అప్పుడే బీసీ 42% రిజర్వేషన్ అమలవుతుంది అని అన్నారు.టీడీపీ పట్టణ అధ్యక్షులు గోపాల్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు
మడివల్ల కృష్ణయ్య, సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి, సిపిఐంల్ మాస్ లైన్ కాశీనాథు, పౌర హక్కుల సంఘం న్యాయవాది కాళేశ్వరం సిఐటియు కార్యదర్శి బలరాం , టిడిపి నాయకులు సోబి మదర్ హుస్సేన్, నజీర్, బీసీ జాగృతి సేన నారాయణపేట నాని పేట నియోజవర్గం అధ్యక్షులు గణేష్ ,మద్దూరు మండల అద్యక్షులు వెంకటప్ప , బీసీ విద్యార్థి సంఘాలు ,బీసీ సంఘాల నాయకులు కురువ మనోజ్ , పవన్ ,రాములు, వినోద్,శ్రీనివాస్ ,వెంకటేష్ , అనిల్,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.దీక్ష విరమణ దామోదర్,రఫీ తో దీక్ష ముగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking