కనక దుర్గా కాళీ మాతా ఆలయంలో భక్తుల సౌకార్యర్థం నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
మియాపూర్ బస్ బాడీ వద్ద గల శ్రీ కనకదుర్గ కాళిమాత ఆలయంలో భక్తులు కాళ్ళు కడుకోవడానికి పడుతున్న ఇబ్బందులను చూసి శ్రీ కనకదుర్గ కాళిమాత టెంపుల్ కమిటీ అధ్యక్షులు రాచమళ్ళ క్రిష్ణ గౌడ్ దంపతులు తమ సొంత నిధులతో భక్తులు సౌకార్యర్థం కాళ్ళు కడుకోవడానికి వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసి ఆదివారం రోజు ప్రారంభించడం జరిగింది.

ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన సలహాదారుడు ఉప్పల.ఏకాంత్ గౌడ్, ట్రెసరి ఈమనియల్ రాజ్, సెక్రటరీ పాపిరెడ్డి, రాంచందర్ గౌడ్, బాబు గౌడ్, రేకమ్మ, చందన, అనోక్, సుభాన్ గౌడ్, నవీన్, తిమ్మయ్య ఆలయ అర్చకులు నాని, గిరి, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.