జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు ఇవ్వాలి
జర్నలిస్టులకు కార్పోరేట్ విద్య వైద్యంను ఉచితంగా అందించాలి
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తేవాలని ఓబిసి మోర్చా నారాయణపేట జిల్లా నాయకులు బాలరాజ్ యాదవ్ ఒక ప్రకటన డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు ప్రెస్ డే శుభాకాంక్షలు.ఈ సందర్భంగా ఓ బి సి మోర్చా నారాయణపేట జిల్లా నాయకులు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో పనిచేసే అర్హులైన జర్నలిస్టులకు ప్రతినెల 15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే రిపోర్టర్లు అందరికీ కార్పోరేట్ స్కూల్స్, హాస్పిటల్లో విద్యా,వైద్యాన్ని ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి,ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు సహాయంగా ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యలపై అధికార పాలకులపై వార్తలు రాసే క్రమంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తేవాలని వారు కోరారు.