భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి

భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి

వలిగొండ /అక్షిత న్యూస్:

మండల పరిధిలోని ఆరుర్ గ్రామ పరిధిలోని మొద్దుల గండి ప్రాంతంలో సర్వే నంబర్ 708 లో గల బోగారం మంజుల పేరు మీద ఉన్న ఒక ఎకరం 32 గుంటల భూమిని,గ్రామానికి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మంజుల భర్త కిష్టయ్య మాట్లాడుతూ కొద్దిరోజులుగా కబ్జా చేసిన వారు మీ భూమి మీకే ఉంది ఎక్కడకు పోతుంది అన్నారని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీకు భూమిలేదని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపొమ్మని అనడంతో ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై తగిన విచారణ జరిపి తమ కొన్ని న్యాయం చేయాలని బోగారం కిష్టయ్య కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking