సత్యసాయి మార్గం అనుసరణీయం

సత్యసాయి మార్గం         అనుసరణీయం

శ్రీ సత్య సాయిబాబా

శత జయంతి వేడుకలు 

ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలు

  ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర 

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

సత్య సాయి బాబా చూపిన సేవ, ధర్మ మార్గం ఎల్లవేళలా అనుసరణీయం అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శ్రీ సత్య సాయి బాబా శత జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మానవ సేవే పరమావదిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారని అన్నారు.

ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆమె అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ సువర్ణ రాజ్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking