నూతన ఎస్సైగా ఎస్. చిరంజీవి బాధ్యతల స్వీకారం

నూతన ఎస్సైగా ఎస్. చిరంజీవి బాధ్యతల స్వీకారం

ప్రజల భద్రత నా మొదటి కర్తవ్యం

ప్రతి ఫిర్యాదు పై తక్షణ చర్యలు తీసుకుంటాను

పోలీసు ప్రజా సంబంధాలను బలోపేతంపై ప్రత్యేక దృష్టి

సైబర్ మోసాలపై, మద్యం దందాపై ప్రత్యేక టీం

నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. చిరంజీవి

నాగారం, అక్షిత న్యూస్ :- నాగారం మండలం పోలీస్ స్టేషన్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తూ ఎస్. చిరంజీవి బుధవారం నాడు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మాట్లాడుతూ నాగారం ప్రజల భద్రత, న్యాయపరమైన సేవలు నా మొదటి కర్తవ్యాలు అని, ప్రజలకు అందుబాటులో ఉండే నా బాధ్యతగా స్వీకరించి ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా తీసుకొని, ఖచ్చితమైన విచారణతో తక్షణ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. గ్రామాల్లో తరచూ పెరుగుతున్న సైబర్ మోసాలు, అక్రమ మద్యం దందా, రహదారి ప్రమాదాలు, రాత్రి భద్రత వంటి అంశాలను ప్రాధాన్యతతో పరిశీలించి, నియంత్రణ చర్యలను మరింత కట్టు దిట్టం చేస్తానని తెలిపారు. నేను ఇదివరకు నల్గొండ టు టౌన్ ఎస్ఐ గా పనిచేసిన కాలంలో పలు క్లిష్ట కేసులను పరిష్కరించిన అనుభవం, ఇప్పుడు నాగారం మండలానికి ఉపయోగపడుతుందని, ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకొని స్టేషన్ పనితీరును పారదర్శకంగా నడిపిస్తానని స్పష్టం చేశారు. పోలీసు ప్రజా సంబంధాలను బలోపేతం చేయడమే సమర్థ పోలీసులకు బలమని, గ్రామాల్లో గస్తీ పెంపు, సిబ్బందికి బాధ్యతల స్పష్టత, యువతలో నేర జ్ఞాన అవగాహన కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. నాగారం ప్రజలు ఎలాంటి సమస్య అయినా నీరుగా నాకు తెలియజేయవచ్చునని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే మా బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై ఎస్. చిరంజీవికి నూతన పరిచయాలతో అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking