అధిష్టానం విశ్వాసం ప్రజల్లో ఆత్మవిశ్వాసం

గుడిపాటి నర్సయ్యకు వెలుగుపల్లిలో కాంగ్రెస్ జైత్రయాత్ర

గుడిపాటి నియామకంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం

నర్సయ్యపై అధిష్టానం విశ్వాసం ప్రజల్లో ఆత్మవిశ్వాసం

రేవంత్ రెడ్డి పాలనను

గ్రామాలకు తీసుకెళ్లేది గుడిపాటినే

స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న

నాగారం, అక్షిత న్యూస్ :

తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామం జన సముద్రంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులుగా గుడిపాటి నర్సయ్య నియామకాన్ని పురస్కరించుకొని ఆదివారం గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో తొలిసారి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి తమ సంస్థానానికి రావడం పట్ల ప్రజలు ఆనందోత్సవాలతో ఒక్కటై ఎన్నడూ లేనట్లుగా ఉత్సవ వాతావరణన్ని జరుపుకున్నారు. డప్పుల మోగింపు, బాణాసంచా పేలుళ్లు, గుడిపాటి మెడలో పూలదండలు, యువజనుల నినాదాలతో వెలుగుపల్లి కాంగ్రెస్ కోట మారు మ్రోగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ గుడిపాటి నర్సయ్య జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడమే కాదు, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లాకు కొత్త దిశ, కొత్త దౌత్వం, ప్రజలతో మరింత చేరువయ్యే నూతన రాజకీయ శకనానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. నాయకత్వం అంటే పదవులు కాదు, ప్రజల గుండెల్లో నిలిచే సేవ, అటువంటి నాయకుడే గుడిపాటి నర్సయ్య అని కొనియాడారు. చిన్న కార్యకర్త సమస్య నుండి రైతు పడే బాధ వరకు ఎవరైనా చేరుకోగానే పరుగెత్తి స్పందించే వ్యక్తి అని తెలిపారు. అందుకే అధిష్టానం ఈ కీలక బాధ్యత గుడిపాటి నర్సయ్య కు అప్పగించిందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ జెండా మరింత ఎగరవేయడానికి అవసరమైన ధైర్యం, విజన్, శ్రమ గుడిపాటి వద్ద ఉందని తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం కాంగ్రెస్ వైపు సునామీలా చేరే రోజులు దరి చేరాయని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పాలన సాగుతుండగా జిల్లా స్థాయిలో ఆ పాలన ప్రజల చెంతకు చేరవేయడం నర్సయ్య చేతుల్లో మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అంతేకాక ప్రజల కోసం పనిచేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గుడిపాటి నర్సయ్య నాయకత్వాన జిల్లాలో ప్రతి గ్రామంలో మూడు రంగుల జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. గుడిపాటి నర్సయ్య నూతన రాజకీయ సంస్కృతికి శ్రీకారం చుడుతున్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా నాయకత్వానికి ప్రతి కార్యకర్త భుజం అందివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking