లక్ష్మాపురం ఫణిగిరి పస్తాల గ్రామాల్లో చీరల పంపిణీ
మహిళల ఆర్థిక సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం కృషి
ప్రజా సంక్షేమం అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
లక్ష్మాపురం ఫణిగిరి పస్తాల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు
నాగారం, అక్షిత న్యూస్ :
మండల పరిధిలోని లక్ష్మాపురం, ఫణిగిరి, పస్తాల గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళల సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా ఈ కార్యక్రమం ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం తొమ్మిది గంటల నుండి మహిళలు భారీగా తరలి రావడంతో చీరల పంపిణీ సందడితో కళకళలాడింది. సంక్షేమం ప్రతి ఇంటికి చేరే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ప్రతిరూపంగా ఈ కార్యక్రమం నిలిచింది. తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామానికి సంక్షేమాన్ని సమానంగా విస్తరించాలన్న లక్ష్యంతో చీరల పంపిణీ కొనసాగిందని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

లక్ష్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గండెల ఉపేందర్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు మల్లెపాక వెంకటయ్య పర్యవేక్షణలో కార్యక్రమం జరిపి, గ్రామంలోని అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫణిగిరి గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి, పస్తాల గ్రామ శాఖ అధ్యక్షులు బండగొర్ల కుమారస్వామి ఆత్మీయంగా గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం మహిళల, ఆర్థిక సామాజిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమాన్ని రాజకీయ ప్రయోజనంగా కాకుండా ప్రజల హక్కుగా అందించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందన్నారు. గ్రామాల్లో మహిళలు శక్తివంతులై గ్రామ అభివృద్ధి సుస్థిరమవుతుందని, అందుకే శాసనసభ్యులు మందుల సామేలు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. పింఛన్లు, గృహాలు, ఆరోగ్య భద్రత, విద్య, ఉపాధి వంటి రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో పేద మహిళల కుటుంబాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగుతుందని అన్నారు. సంక్షేమ ఫలాలు సాక్షాత్కారంగా చూపిస్తున్నాయని, ప్రజలతో పాలన నేరుగా కలిసే విధంగా ఎమ్మెల్యే సామేలు ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమని విశ్లేషకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. చీరలు స్వీకరించిన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం ఎంతో ఆనందకరమని, ఇలాంటి పథకాలు కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా పండగ రోజుల ఆనందాన్ని తెచ్చిపెడుతున్నాయని అభివర్ణించారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ గ్రామాలకు నిరంతరంగా రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మాపురం ఫణిగిరి పస్తాల గ్రామాల్లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమం ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వ అవగాహన ప్రతిబింబించడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరిచిందని తెలిపారు. గ్రామాల్లో పార్టీ నాయకుల చురుకైన పాత్ర, స్థానిక ఎమ్మెల్యే దర్శకత్వం మరియు ప్రజల ఆశీర్వాదాలు కలిసి అభివృద్ధి బాటలో గ్రామాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ తడకమల్ల నాగ మల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్పలపల్లి ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మల్లెపాక యాకయ్య, మల్లెపాక వెంకన్న, విబికే మల్లెపాక వెంకటయ్య, చిప్పలపల్లి లింగయ్య, పొదిల రామ్మూర్తి, రేణుక, బక్కమ్మ, సునీత, మల్లెపాక ఇందిరమ్మ, మల్లెపాక లక్ష్మి, శాగంటి భాగ్యమ్మ, శాగంటి మణెమ్మ, చిప్పలపల్లి లింగయ్య, జానకమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి, నాతి వీరమల్లు, ఆలకుంట్ల బాలకృష్ణ, బత్తుల కరుణాకర్, జంపాల రవీందర్, రావుల సత్తయ్య, పంది ఆవిలయ్య, వల్లాల భాను ప్రకాష్, గట్టు లక్ష్మీకాంత్, దారం రవి, మందుల వెంకన్న, యాట భాస్కర్, చుక్క మహేష్, బత్తుల మహేష్, తిరుమలగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్, మరియు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టంగూరు వెంకటరెడ్డి, జలగం అబ్బయ్య, కాట్రేవుల వినోద, పులుసు రేణుక, సునీత, అలివేలు మంగమ్మ, చిత్తలూరి అనిత తదితరులు పాల్గొన్నారు.