కాంగ్రెస్ నాయకులచే గుడిపాటి నర్సయ్యకు ఘన సన్మానం
ప్రతి కార్యకర్తకు గౌరవం
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బలోపేతం
గుడిపాటి నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం
ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
ఫణిగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి
నాగారం, అక్షిత న్యూస్ :- సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన గుడిపాటి నర్సయ్య ను అభినందిస్తూ, మండల పరిధిలోని ఫణిగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో ఆప్యాయంగా సన్మానించి ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఉత్సాహభరితంగా సాగింది. గ్రామ ప్రజలు, మహిళలు, యువత తరలిరావడంతో కార్యక్రమ స్థలం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా కసిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ గుడిపాటి నర్సయ్య వంటి నీతి, నిజాయితీ పరుడు పార్టీకి కట్టుబడి ఉన్న, అనుభవజ్ఞుడైన నాయకుడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తల మనోబలం పెరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గుడిపాటి నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పాలనను సమర్ధవంతంగా ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయని అన్నారు. ఈ సన్మానం కార్యక్రమం సందర్భంగా నూతన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం ఉంచిన నాయకులు, కార్యకర్తలతో సహా ని స్వార్ధంగా పనిచేస్తానని, సూర్యాపేట జిల్లాలో ప్రతి గ్రామం అభివృద్ధి, ప్రతి కుటుంబ సంక్షేమం, ప్రతి కార్యకర్త గౌరవమే తన ద్యేయమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నా శక్తినంత శ్రమించి కాంగ్రెస్ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన చేర్చేందుకు కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల బుచ్చిబాబు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి, నాతి వీరమల్లు, బత్తుల కరుణాకర్, జంపాల రవీందర్, రావుల సత్తయ్య, పంది అవిలయ్య, వల్లాల భాను ప్రకాష్, ఎండోమెంట్ చైర్మన్ గట్టు లక్ష్మీకాంత్, దారం రవి, మందుల వెంకన్న, యాట భాస్కర్, చుక్క మహేష్, బత్తుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.