వదిలేది లేదు
బట్టలిప్పి కొట్టిస్తాం
భయపడేది లేదు
ప్రతిఫలం తప్పదు
నందిగామ సిఐ ప్రసాద్
ను బట్టలిప్పి కొట్టే రోజులొస్తాయి
రెచ్చిపోయిన పాలమూరు
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
పెట్రేగుతున్న మాజీ ఎమ్మెల్యే
అంజయ్య యాదవ్, అతని కుమారులు రవి, మురళి అరాచకాలు
ఎమ్మెల్యే శంకర్, మాజీ
ఎమ్మెల్యే అంజయ్య, ఆయన కుమారులపై మండిపడ్డ ఎమ్మెల్సీ
సర్పంచ్, వార్డు అభ్యర్థులను
కూడా చూడకుండా పోలీసుల దాడులు
నా అనుచరులు ఏం
తప్పు చేశారని
ఎక్లాస్ ఖాన్ పేటలో
దాడి చేశారు..?
చిత్తుగా ఓడిపోయినా
అంజయ్యకు బుద్ధి రాలే
షాద్ నగర్, అక్షిత ప్రతినిధి :
వదిలేదు… భయపడం.. అరాచకాలు చేస్తే ఊరుకునేది లేదు.. సీఐ ప్రసాద్ ను బట్టలూడదీసి కొట్టే రోజులొస్తాయని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల వైపు ఉండాల్సిన సిఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఇదే ప్రవర్తన కొనసాగితే మున్ముందు రోజుల్లో బట్టలిప్పి కొట్టే పరిస్థితులు ఏర్పడతాయని మండిపడ్డారు. గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీడియాతో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన చేసిన ప్రకటన స్థానికంగా సంచలనానికి కారణమవుతోంది. అరాచకాలు సృష్టిస్తున్న వారిని వదిలేసి మాపై దాడులు చేస్తున్న పోలీసులను బట్టలు విప్పి కొట్టే పరిస్థితి వస్తుంది.. అంటూ ముఖ్యంగా నందిగామ సిఐ ప్రసాద్ పై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, అతని కుమారులు రవి యాదవ్, మురళి యాదవ్ అరాచకాలు షాద్ నగర్ నియోజకవర్గంలో పెచ్చు మీరిపోయాయి.. అందుకే ప్రజలు ఓడగొట్టారు. ఓడిపోయిన మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాం మాజీ ఎమ్మెల్యేకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైనే మండిపడటం వివాదానికి ఆజ్యం పోసింది. అంతలోనే ఎమ్మెల్యే, కాసుల బాదు శంకరయ్య అధికార ముందనే తమపై అధికార దర్పం ప్రదర్శిస్తున్నారని, ఎప్పటికీ ఒకరే అధికారంలో ఉండరని ఆయన హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని చేసే అభివృద్ధి శాశ్వతం అని ఆయన స్పష్టం చేశారు… కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో రాత్రి తన అనుచరులపై దాడులకు తెగబడ్డారని, ఏం తప్పు చేశారని, ఎందుకు అరాచకాలు సృష్టించారని ప్రశ్నించారు. గత పది ఏళ్లు ఎమ్మెల్యేగా పాలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదని, పెద్దలు కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేస్తే ఆయన కుమారులు ఎన్ని రోజులు ఈ అరాచకాలు అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరి మధ్య సయోధ్య ఉంటే వారు ఏదైనా ప్రయోజనాలు పొందాలని అంతేకానీ ప్రజల వద్దకు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఇలాంటి బెదిరింపులు అరాచకాలు చాలా చూశానని ఎవరికి భయపడే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ నాలుగుసార్లు మాజీ ఎమ్మెల్యే అంజయ్యకు టికెట్ ఇచ్చిందని, ఆయన కుమారులు రెచ్చిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. అరాచకాలు మితిమిరితే ఎవరినైనా బట్టలు విప్పే కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య ఆయన కుమారులను ఉద్దేశించి ఆయన ఉద్వేగపూరితంగా మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. ఇంత అరాచకం ఏ నియోజకవర్గంలో చూడలేదని ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంటుందని రెండేళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరిని వదిలిపెట్టే
ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ హెచ్చరించారు.