95 ఏళ్ల వృధా నాయకుడికి ప్రజాతీర్పులో ఘన విజయం
వయస్సు కాదు సేవే ప్రధానమని నిరూపించిన వృద్ధ నాయకుడు
సేవా భావానికి ప్రజలు ఇచ్చిన గౌరవం భారీ మెజార్టీ
నాగారం అక్షిత న్యూస్ :-వయస్సు తొంబైఐదు – ప్రజాతీర్పులు ఘనవిజయం నాగారంలో చారిత్రాత్మక ఘనత, గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్ గా ఎన్నిక. నాగారం గ్రామపంచాయతీ ఎన్నికలలో 95 ఏళ్ల వృద్ధ నాయకుడు గుంటకండ్ల రామచంద్రారెడ్డి సాధించిన విజయం గ్రామీణ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ అపూర్వ ఘట్టంగా నిలిచింది. ఆశయం, నిబద్ధత, సేవా భావానికి వయస్సు అద్దంకి కాదని నిరూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన, తన అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధంతో కొంత మెజార్టీ సాధించి సర్పంచి పదవిని గెలుచుకున్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తండ్రిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, రామచంద్రారెడ్డి ప్రజల మధ్య బాపుగా పేరు తెచ్చుకున్నారు. ఏళ్ల తరబడి గ్రామస్తులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ, వారి సమస్యలను తనవిగా భావిస్తూ సేవ చేసిన తీరు ఆయనకు అపారమైన ప్రజాభిమానాన్ని తెచ్చిపెట్టింది. వయస్సు పైబడిన ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ, గ్రామాభివృద్ధి ప్రాధాన్యతలపై స్పష్టమైన హామీలు ఇస్తూ ప్రజల్లో నమ్మకం పెంచిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ప్రచారంలో గ్రామ యువత ఆయనతో కలిసి పనిచేయడం, పెద్దలు ఆయనకు ఆశీస్సులు అందించడం, గ్రామస్తులంతా ఒక్కటిగా నిలబడి బాపూ ను సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టాలని కోరుకోవడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రజలు ఇచ్చిన ఈ ఘన తీర్పు వృద్ధా నాయకుడి సంకల్పానికి, ఆయన సేవ స్ఫూర్తి కి ఇచ్చిన గౌరవం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాగారం ప్రజలు రామచంద్రారెడ్డిని కేవలం నాయకుడుగానే కాకుండా, గ్రామానికి అండగా నిలిచే పెద్దగా చూసుకుంటారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ తన ధ్యాయమని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆయన సంకల్పం ప్రజల్లో ఉత్సాహాన్ని రేపింది. సమీప ప్రత్యర్థిపై గననీయమైన మెజార్టీ సాధించడం ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. 95 ఏళ్ల వయస్సులో సర్పంచిగా ఎన్నికవ్వడం ఒక రికార్డు అయితే, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం మరొక మహత్తర ఘనత. ఈ విజయంతో నాగారం గ్రామంలో అభివృద్ధి కార్యాచరణలకు కొత్త ఊపు రానుందని ప్రజలు నమ్ముతున్నారు.. వయస్సు ఎంతైనా, సేవకు అంకితమైన హృదయం అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు గౌరవించాలని ఈ విజయం మరోసారి రుజువు చేసింది