సాంకేతికంగా ఓడినా నైతిక విజయం నాదే

సాంకేతికంగా ఓడినా నైతిక విజయం నాదే

* ప్రలోభాలకు గురిచేసిన తలొగ్గని నైజం మాది

* బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్సం రమేష్

వలిగొండ, అక్షిత న్యూస్ :

గ్రామ పంచాయతి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిన నైతిక విజయం తనదేనని వలిగొండ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్సం రమేష్ అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని స్వర్ణకారుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎమ్మెల్యే సొంత గ్రామమైన వలిగొండలో గట్టి పోటీ ఇచ్చామన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యన ఉంటూ వారికోసం పనిచేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా తనకు ఓట్లు వేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఇతర పార్టీలో ఉండి కూడా తనకు సహకరించిన వారు, వివిధ వర్గాల ప్రజలు నా విజయం కోసం ఎదురు చూశారన్నారు.

వారి అశలను అందుకోలేకపోయానని తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు సాయిని యాదగిరి లాంటి వాళ్లు కూడా తన గెలుపు కోసం కృషి చేశారని, అయినా ఓడిపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు. రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని, బీఆర్‌ఎస్‌లో అవకాశం ఇచ్చిన, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలో ఇంతటి ట్రెండ్‌ సృష్టించి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలపై ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తానన్నారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోందని చెప్పిన వారందరికీ ఇది ఒక కనువిప్పు అని తెలిపారు. మాజీ జెడ్పిటిసి మొగుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నియోజకవర్గంతో పాటు సొంత మండలంలో టిఆర్ఎస్ అధిక స్థానాలను కైవసం చేసుకుని విజయ డంకా మోగించిందని టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ కంటే అధిక స్థానాలు సాధించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు వల్ల కృష్ణ, పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ అప్రోచ్, వార్డ్ మెంబర్లు బల్గూరి నరేష్ రెడ్డి, బుంగమట్ల యాద లక్ష్మి సుధాకర్, పబ్బు శ్రీనివాస్ గౌడ్, ఐటిపాముల సత్యనారాయణ కొండూరు వెంకటేశం బెలిదే శ్రీనివాస్, బొల్లు కృష్ణ, కల్లెం మారయ్య, ఏదురుగట్ల రాములు, పల్లెర్ల రామచందర్ మోతే మల్లేష్ కళ్లెం రాములు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking