*2వ రోజు కొనసాగిన క్రీడల పోటీలు*
– విద్యార్థులకు బహుమతులు అందజేసిన మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి
– చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి
– ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి
– రెసిడెన్షియల్ పాఠశాలల్లోని వసతులను ఉపయోగించుకొని విద్యార్థులు ఎదగాలి
– మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, అక్షిత ప్రతినిధి:
విద్యార్థులకు విద్య తో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని జగన్ గూడ లో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్) స్థాయి అండర్ 14, 17 19 క్రీడల పోటీలు కొనసాగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడలు పోటీలలో 2వ రోజు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉండే వసతులను ఉపయోగించుకొని జీవితంలో మంచి ఉద్యోగాలు సాధించే స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ, డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఆర్టిఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
*విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి*
మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని జగన్ గూడ లోగల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి వాలీబాల్, కబడ్డీ ఆడారు. ఈ క్రీడ పోటీల్లో విద్యార్థులతో ఎమ్మెల్యే మల్లారెడ్డి చురుకుగా ఉంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగుతూ సరదాగా గడిపారు. విద్యార్థులతో విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని మల్లారెడ్డి సూచించారు.