కలెక్టర్ ప్రశంసలందుకున్న ప్రసాద్
ఉత్తమ సేవలకు విశిష్ట ప్రశంస
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఎన్నికల్లో ఉత్తమ సేవలందించిన ప్రసాద్ కు విశిష్ట ప్రశంస లభించింది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ సేవలందించి విశిష్ట ప్రతిభ కనపరచిన మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ మాతంగికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మల్లెంపాటిల ప్రశంస లభించింది. విధి నిర్వహణలో నిబద్ధత, పారదర్శకత, అంకిత భావంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా సేవలందించిన ప్రసాద్ కు విశిష్ట సేవల ప్రశంసాపత్రo అందుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసలందుకున్న ప్రసాద్ ను పలువురు అభినందించారు. మరిన్ని సేవలందించి ఎన్నో పురస్కారాలు అందుకోవాలని పలువురు ఆకాంక్షించారు.