నాగారం బంగ్లా సర్పంచ్ కి యూత్ కాంగ్రెస్ సన్మానం

నాగారం బంగ్లా సర్పంచ్ కి యూత్ కాంగ్రెస్ సన్మానం

బయ్యం సుజాత వెంకన్నకు యూత్ కాంగ్రెస్ శుభాకాంక్షలు

ప్రజాభిమానంతో సర్పంచ్ గా ఘనవిజయం

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకపాత్ర పోషించాలి

ప్రజాసేవ ధ్యేయంగా సర్పంచ్ ప్రయాణం చేయాలి

మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ నాతి శ్రీనివాస్

నాగారం, అక్షిత న్యూస్ : మండల పరిధిలోని నాగారం బంగ్లా గ్రామ సర్పంచ్ బయ్యం సుజాత వెంకన్నను మంగళవారం మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మాచిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే యాదగిరి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. బయ్యం సుజాత వెంకన్న నాటినుండి నేటి వరకు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా సమస్యలను స్పందించి తక్షణమే పరిష్కార దిశగా చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొని గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గ్రామానికి ఇంకా మరింత సేవ చేయాలనే నమ్మకంతో సర్పంచ్ గా ప్రజలు ఎన్నుకోవడంతో ఈ సన్మానం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ, సమన్వయం ఎంతో అవసరమని తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించి అర్హులైన ప్రతి మనిషికి అందేలా ప్రధాన భూమిక పోషించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా అనుకూల విధానాలను గ్రామస్థాయిలో సమర్థంగా అమలు చేయాలంటే పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామపంచాయతీ పాలకమండలిని సమన్వయంతో నడుపుతూ సమిష్టి కృషితో గ్రామ మౌలిక సమస్యలను తీరుస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ తమ పదవీకాలం ఉన్నంతవరకు మంచి పేరుతో ప్రజల ఆశీస్సులు పొందాలని ప్రజాసేవలో పరుగులు తీయాలని మనసారా దీవించారు. ఈ కార్యక్రమంలో మాచిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శీల లింగమల్లు, ఈదుల ఉప్పలయ్య, మట్టగజం అంజయ్య, ఆకుల మల్లేష్, వడ్డే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking