సహచరత్వానికి సజీవ సాక్ష్యం కమలాకర్
కుటుంబానికి స్నేహితుల సాయం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కమలాకర్ కుటుంబానికి రూ. 2,67,000/- సాయం
అకాల మరణం కలచివేసిన ఐక్యతతో కుటుంబానికి భరోసా
ఆర్థిక సహాయంతో పాటు ధైర్యం నింపిన తోటి మిత్రులు
కష్టకాలంలో మాటల కన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం
పోలీసు వృత్తిలో మానవీయ విలువలకు నిలువెత్తు సాక్ష్యం
నాగారం అక్షిత న్యూస్ :- సహచరత్వానికి సజీవ సాక్ష్యం – అకాలంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు. నిధి నిర్వహణలో భాగంగా సమాజశాంతి, భద్రతల కోసం పనిచేస్తూ తమ వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టే పోలీస్ శాఖలో సహచరత్వం ఎంత గొప్పదో మరోసారి స్పష్టమైంది. నాగారం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో అకాలంగా మృతిచెందిన శీలం కరుణాకర్ కుటుంబానికి ఆయనతో కలిసి 2009 బ్యాచ్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తోటి కానిస్టేబుల్ లు మానవీయతతో అండగా నిలిచారు. కమలాకర్ మృతి పోలీస్ వర్గాలను తీవ్రంగా కలిసి వేయడంతో పాటు కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక, మానసిక దుఃఖంలోకి నెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేవలం సానుభూతి మాటలతో సరిపెట్టకుండా, బాధిత కుటుంబానికి వాస్తవంగా తోడుగా నిలవాలని సంకల్పంతో 2009 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్లు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. తోటి మిత్రుల సహకారంతో మొత్తం రూ. 2,67,000/-నగదును సమీకరించి బుధవారం కమలాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని తమ కుటుంబాన్ని భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం వచ్చిన తామంతా అండగా ఉంటామని తోటి కానిస్టేబుల్లు భరోసా ఇచ్చారు. పోలీస్ శాఖలో విధి అనేది కేవలం ఉద్యోగ పరిమితుల్లోనే కాకుండా, కష్టకాలంలో ఒకరికొకరు భరోసాగా నిలవడం నిజమైన సేవ అని ఈ ఘటన స్పష్టంగా చాటింది. సహచరుడి అకాల మరణం బాధాకరమైనదైన, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి మిత్రులు చూపిన ఐక్యత, మానవీయత పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ సహాయంతో కుటుంబానికి కొంతైనా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిందని కుటుంబ సభ్యులు భావోద్వేగంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో 2009 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్లు జె. శ్రీకాంత్, కె. సైదులు, టి. నరేష్, సిహెచ్ దుర్గాప్రసాద్, జోసెఫ్, రవి, మధుకర్, జానీమియా తదితరులు పాల్గొన్నారు.