ఈటూరు సర్పంచ్ కు బీసీ జేఏసీ నేతల శుభాకాంక్షలు

ఈటూరు సర్పంచ్ కు బీసీ జేఏసీ నేతల శుభాకాంక్షలు

వంగూరి దామోదర్ సత్కారం గ్రామాభివృద్ధిపై నేతల ఆకాంక్ష

నమ్మకం ధైర్యం నింపే నాయకత్వం కావాలి నేతల సూచన

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

సామాజిక సమానత్వంతోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యం

ప్రజల మధ్య సర్పంచ్ పాలన ఉండాలి ప్రజలకు నమ్మకంగా పనిచేయాలి

జిల్లా బిసి జేఏసీ నేతలు భద్రబోయిన సైదులు బై రోజు మదనాచారి

నాగారం అక్షిత న్యూస్ : నూతన సర్పంచ్ కు బిసి జేఏసీ జిల్లా నేతల శుభాకాంక్షలు. మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన వంగూరి దామోదర్ ను సూర్యాపేట జిల్లా బిసి జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బైరోజు మదనాచారి లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు బైరోజు మదనాచారి మాట్లాడుతూ ఈటూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నూతన సర్పంచ్ నడిపించాలని ఆకాంక్షించారు. సర్పంచ్ గా ఎల్లవేళలా గ్రామ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. వంగూరి దామోదర్ అన్న అంటే గ్రామ ప్రజల్లో ధైర్యం, నమ్మకం కలిగేలా నాయకత్వం ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే గ్రామాభివృద్ధి అనేది కేవలం మౌలిక సదుపాయాల కే పరిమితం కాకుండా, సామాజిక సమానత్వం, ప్రజల ఐక్యతతోనే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు తీసుకెళ్లే పాలనలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గ్రామపంచాయతీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. నూతన సర్పంచ్ వంగూరి దామోదర్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని అహమీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ జిల్లా నాయకులు కక్కిరేణి నాగేంద్రబాబు, కాగితాల కిరణ్ కుమార్ చారి, ముత్యం నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking