కారు ప్రమాదంలో ఐదుగురు కాగజ్ నగర్ మహిళల మృతి

కారు ప్రమాదంలో ఐదుగురు కాగజ్ నగర్ మహిళల మృతి
ముగ్గురి పరిస్థితి విషమం…

ఆసిఫాబాద్, అక్షిత ప్రతినిధి :

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ సమీపంలోని దేవాడ గ్రామం వద్ద బ్రిడ్జి పైనుండి వారు ప్రయాణిస్తున్న కారు ప్రదవశాత్తు కింద పడగా ముగ్గురు మహిళలు ఒక బాలిక ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడ మృతి చెందారు. మృతి చెందిన వారు కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహిళలు. మృతుల్లో పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న జాకీర్ భార్య,సల్మా బేగం, కూతురు షబ్రీమ్, మరియు 14, నంబర్ వార్డుకు చెందిన వారి బంధువులు ఇద్దరు మహిళలు ఆఫ్జా బేగం, సహార ఉన్నారు.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ మరో మహిళ నషాద్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన కారులో తొమ్మిది మందిబ్రాయణిస్తుండగా అందులో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డ్రైవర్ క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking