చేర్యాల మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చేర్యాల అక్షిత ప్రతినిధి : క్రిస్మస్ వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణ ఇండియా మిషన్ కాంపౌండ్ ఆవరణంలో దైవ సేవకులు ప్రభుదాస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించగా, మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో ఇమ్మానియేల్ గాస్పెల్ చర్చి నందు దైవ సేవకులు పాస్టర్ అనోకు క్రిస్మస్ వేడుకలను నిర్వహించి నారు ఈ సందర్భంగా పాస్టర్ అనోకు మాట్లాడుతూ యేసు ప్రభువు చూపిన కరుణ, దయ మార్గము మానవాళికి ఆదర్శమన్నారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెళ్లివిరి యాలని, ప్రతి ఒక్కరు తోటి వారికి సహాయము చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా దైవ సేవకులు పాస్టర్ అనోకు, సంఘ పెద్దలచేతుల మీదిగా క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఒకరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ కొమురవి నీ, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ సభ్యులు పీటర్, కోతి దాసు, పుల్లని రత్నం, మరియు స్త్రీలు,పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.