కోదాడలో క్రిస్మస్ వేడుకలు

కోదాడలో క్రిస్మస్ వేడుకలు

సీసీ రెడ్డి కాన్వెంట్‌కు మంత్రి ఉత్తమ్ హాజరు

కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు ఘన స్వాగతం

కోదాడ, అక్షిత ప్రతినిధి :

కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. వేడుకలకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు ఘన స్వాగతం పలికి అభివాదం చేశారు.

మంత్రి ఉత్తమ్ కృష్ణారావును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ కొంతసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ స్థానిక అభివృద్ధి అంశాలు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking