సర్పంచుల ఫోరం అధ్యక్షున్ని సన్మానించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

సర్పంచుల ఫోరం అధ్యక్షున్ని సన్మానించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఆత్మకూర్(ఎం), అక్షిత న్యూస్ :

మండల పరిధిలోని సర్వేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా గురువారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఉపేందర్ రెడ్డిని ఘనంగా శాలువా కప్పి సన్మానించారు అదేవిధంగా ఉపేందర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు బిర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేసి శాలువా కప్పి సన్మానం చేశారు,అనంతరం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచుల సమస్యలు మండలంలో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నగేష్, ముద్దసాని సిద్ధులు,బత్తిని ఉప్పలయ్య,పోతగాని మల్లేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking