సబ్ డీలర్ రేషన్ దుకాణం ప్రారంభం
ఆత్మకూర్(ఎం), అక్షిత న్యూస్:
ఆత్మకూరు మండల పరిధిలోని తుక్కాపురం గ్రామ పంచాయతీ మధిర పోసాని కుంట లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్ సంఘపాక శ్రీవాణి మహేష్ ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం నూతన సబ్ రేషన్ డీలర్ షాప్ ని తహసీల్దార్ లావణ్య ఆదేశాల మేరకు..డిప్యూటీ తహసీల్దార్ సఫీయొద్దీన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిపిఓ వీరస్వామి,వార్డు మెంబర్ అలివేలు,వారాల వెంకటరెడ్డి వారాల,మల్లారెడ్డి,డీలర్ సుధాకర్,సతీష్,కృష్ణారెడ్డి, సత్తిరెడ్డి,మహేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నర్సిరెడ్డి,చిక్కిరి రవి,నరేష్, వెంకటరెడ్డి, అంజయ్య, శ్రీధర్,కానుకుంట్ల వెంకటయ్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు..