ఆరుట్ల ఫౌండేషన్ స్మారక క్రీడోత్సవాల ముగింపు
* ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సత్యం హాజరు
* పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
ఆత్మకూర్(ఎం), అక్షిత న్యూస్:
ఆత్మకూర్ మండల కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష నాయకురాలు ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి స్మారక క్రీడోత్సవాల సందర్భంగా ఆలేరు నియోజకవర్గ స్థాయి క్రీడోత్సవాలను ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగినటువంటి సాయుధ పోరాటంలో వీరోచితమైనటువంటి పోరాటానికి నాయకత్వం వహించి నట్టి పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి,రామచంద్రారెడ్డి.ఈనాటికి కూడా వారి స్వారక దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రీడలను ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహిస్తున్నటువంటి ట్రస్టుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

అదేవిధంగా మూడు రోజులపాటు కొనసాగుతున్న క్రీడలు నిర్వహించడం వల్ల విద్యార్థినీ విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు రాష్ట్రం దేశం మెచ్చే క్రీడ స్ఫూర్తిని నింపిన వారం అవుతామని అన్నారు.నేను మొదటిసారిగా శాసనమండలి సభ్యునిగాఎన్నికైన తరువాత ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి అన్న పేరుమీద క్రీడోత్సవాలను జరిపించడం అలాంటి కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేసి..క్రీడల ముగింపు సభకు రావడం ఆనందంగా వాళ్లను గుర్తుచేసుకున్న రోజుగా భావిస్తున్నానని అన్నారు.ఇటువంటి సాయిధ పోరాట యోధుల్ని.అలాగే రావి నారాయణరెడ్డి అదేవిధంగా అనేకమంది ఈ ప్రాంతంలో ఆనాడు వీరోచిత పోరాటానికి నాయకత్వం వహించిన ప్రతి ఒక్కరిని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ ట్రస్టు ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. శాసన సభ్యునిగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తానని.. పాఠశాల ఉపాధ్యాయ బృందానికి,ఇక్కడికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీ నాయకులకు,పోటీలలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేశారు.
అనంతరం కబడ్డీ,వాలీబాల్, కోకో,చెస్ వివిధ ఆటలలో ఫస్ట్,సెకండ్ థర్డ్ లలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొత్త మహాదేవ రెడ్డి,ఆత్మకూరు సర్పంచ్ బీసు ధనలక్ష్మి, ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్, జిల్లా స్పోర్ట్స్ అధికారి ధనుంజయ్, ఫిజికల్ డైరెక్టర్ ఇందిరాల ప్రియ, ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల సుశీల దేవి,ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు,సిపిఐ జిల్లా కార్యదర్శి యనాల దామోదర్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బిసు చందర్ గౌడ్,మాజీ జెడ్పిటిసి సభ్యులు పూర్ణచంద్ర రాజు, స్కూల్ చైర్మన్ సుగుణమ్మ, ఉప్పల ముత్యాలు,వెంకన్న, వివిధ రాజకీయ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..