- సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
- మహిళలతో కలిసి ముగ్గులు వేసిన మల్లారెడ్డి
- మున్సిపాలిటీ ఎన్నికలపై సవాల్ విసిరిన మేడ్చల్ ఎమ్మెల్యే
- కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు
- మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, అక్షిత ప్రతినిధి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలోని కిష్టాపూర్ – పూడూర్ సర్కిల్ పరిధిలో గల కెఎల్ఆర్ వెంచర్ లో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు కెఎల్ఆర్ వెంచర్ లో ప్రధాన వీదుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులతో కలిసి మల్లారెడ్డి ముగ్గులు వేసి అందరిని అలరించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. నన్ను ఆదరిస్తున్న మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు. మార్చి నెలలో నా 50వ పెళ్లిరోజు ఉన్నందునా ఈ నెల 26 నుండి నియోజకవర్గ వ్యాప్తంగా యుతకు క్రికేట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రికెట్ పోటీల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంధాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరి గెలుపో చుద్దాం అంటూ మల్లారెడ్డి సవాల్
మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు. ఈ మున్సిపాలిటీల్లో ఎవరి దమ్ము ఎంతుందో చూసుకుందామని సవాల్ విసిరారు. ప్రతి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వన్ సైడ్ గెలుచుకొని మూడు ఛైర్మన్ పదవులు గెలుస్తామని ఛాలెంజ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రాష్ట్ర ప్రజలంతా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎలాంటి సమస్యలు లేవని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నీటి కష్టాలు, విధ్యుత్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రియస్టేట్ లేక వ్యాపారాలు లేకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆచరన లేదన్నారు. నన్ను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. హాస్పటల్ లో ఉచిత వైధ్యం అందిస్తున్నామన్నారు. తమ కాలేజ్ లలో తక్కుల ఫీజులతో మంచి విద్య అందిస్తున్నామన్నారు. మా జన్మంతా ప్రజా సేవకే అంకితమన్నారు.
