- యువత ఉన్నత స్థాయికి ఎదగాలి
- చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్
- ఇప్పలపల్లి ప్రీమియర్ లీగ్ -7 ప్రారంభించిన రవీందర్ యాదవ్, హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు
షాద్ నగర్, అక్షిత ప్రతినిధి: యువత చదువు, ఆటపాటలు వ్యాపార రంగాలతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న ఇప్పలపల్లి ప్రీమియర్ లీగ్ – 7 క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని జీవితంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుందని అన్నారు. గ్రామస్థాయిలోని క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని అన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ అంజి రెడ్డి, సర్పంచులు మంజుల జంగయ్య, రామకృష్ణ, రాజు, మాజీ సర్పంచ్ యాదగిరి రావు, వెంకట్ రెడ్డి, వెంకటయ్య, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, నాయకులు జగన్మోహన్ రెడ్డి, జమాల్ ఖాన్, ప్రేమ్ కుమార్ గౌడ్, భద్రు నాయక్, గుండు అశోక్, నవీన్, రాఘవేందర్ గౌడ్, వెంకటేష్, బాబు, ఉమాపతి, రామ్, అసిఫ్, నగేష్, శ్రీశైలం, శ్రీరాములు, శివ, శ్రీకాంత్, సాయి, వినయ్, బాలు, కుమార్, సిద్దు, సంజు నాయక్, రాజేష్ నాయక్, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
