డిసీసీ అధ్యక్షులుగా ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం

 

డిసీసీ అధ్యక్షులుగా ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మెట్రో ఫంక్షన్ హల్ లో నేడు ప్రమాణ స్వీకారం 

నారాయణపేట టౌన్, అక్షిత న్యూస్ :

నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడ్డ కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటలకు స్థానిక మెట్రో ఫంక్షన్ హల్ లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి  వాకిటి శ్రీహరి,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, నియోజకవర్గ ఇంచార్జీలు ఏనుముల తిరుపతి రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డిలతో పాటు ఉమ్మడి జిల్లా డిసీసీ అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు  తదితరులు పాల్గొంటారని తెలిపారు. కావున ఇట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking