రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా జెన్నపల్లి పద్మకృష్ణ

మహేశ్వరం, అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని మాణిక్యమ్మ కూడా గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ ని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా జిల్లా సర్పంచుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాణిక్యమ గూడా గ్రామ సర్పంచ్ పద్మకృష్ణ మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి ఈ యొక్క బాధ్యతను అప్పజెప్పినందుకుతెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ సర్పంచుల సంఘం మందిపల్ వెంకట్ రాష్ట్ర సెక్రటరీ, మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో. రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్నాపురం శివశంకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కార్యనిర్వాక అధ్యక్షులు మాధవి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఈ రవి, జె పద్మకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు.. గొటికే గోపాల్ రెడ్డి, జక్క రవీందర్ రెడ్డి, బొప్పిడి గోపాల్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి.. మూడవత్ శ్రీను రంగారెడ్డి జిల్లా సర్పంచులు అందరికీ పేరుపేరునా మాణిక్యమ్మ గూడ గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking