యాదాద్రి భువనగిరి, అక్షిత న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉన్నత కళాశాల 1992- 95 బ్యాచ్ పూర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఆదివారం ఘనంగా జరిగింది. 30 ఏళ్ల అనంతరం కలుసుకున్న మిత్రులు కళాశాలలో గత జ్ఞాపకాలను, తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆత్మీయంగా ఒకరినొకరును పలకరించుకున్నారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆపదలో ఉన్న మిత్రులను ఆదు కోవాలని నిర్ణయించారు. పూర్వ రాజనీతి శాస్త్ర లెక్చరర్ చాగంటి బుచ్చయ్య గురువుకు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలిమినేటి జహంగీర్ ,మైపాల్ రెడ్డి, ఆకుల సుధాకర్, కరుణాకర్ రెడ్డి,వెంకట్ స్వామి, చిలువేరు రమేష్ ,వెంకట్ రెడ్డి,మల్లేష్ , సునీల్ ,విద్యాసాగర్రెడ్డి, బాలాజీ,ఇందిరా, విజయలక్ష్మి, ప్రపూర్ణ , మాధవి, రాణి ,అప్సర్, సుకన్య, రేణుక, మాధవి, రమ లు పాల్గొన్నారు.
