ఖమ్మం, అక్షిత బ్యూరో : ఖమ్మం నగరం లోని మమతా రోడ్డుపై గల పులిపాటి నగర్–2, 20వ డివిజన్ పరిధిలో పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా ముగిశాయి. వీక్షకులను ఆకట్టుకునే విధంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 326 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు.
ఈ ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రధమ బహుమతిగా రూ.5,000, ద్వితీయ బహుమతిగా రూ.3,000, తృతీయ బహుమతిగా రూ.2,000 నగదు బహుమతులు ప్రకటించారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ బహుమతులను రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదుగా తుమ్మల యుగంధర్ మరియు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ముగ్గుల పోటీలు సాంప్రదాయ సాంస్కృతిని కాపాడడమే కాకుండా మహిళల్లో ఐక్యతను సామాజిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేశాయని తెలిపారు. అంచనాలకు మించి మహిళలు పాల్గొనడంతో కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని పేర్కొంటూ, సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ యర్నాటి కోటేశ్వరరావు ఎర్రబోతుల వెంకటేశ్వర రెడ్డి మంగపతి వీరారెడ్డి పట్నాయక్ వెంకటేశ్వర్లు చింతలపూడి పైడిపల్లి నాగేశ్వరరావు రామచంద్ర రావు వీరభద్రరావు కిలారు నీరజ బైరెడ్డి శ్రీలత పుల్లయ్య వెంకటేశ్వరరావు పీవీ సత్యనారాయణ తుమ్మటి ప్రభాకర్ రెడ్డి కొంగర మాధవరావు సుధాకర్ పుల్లారెడ్డి పాలవాయి వెంకటేశ్వర్లు తూనుగుంట్ల సంతోష్ చక్రవర్తి సిద్ధంశెట్టి శ్రీకాంత్ కోదుమూరు భద్రయ్య కొదుమూరు జగన్నాథం కొంకిమళ్ళ మృత్యుంజయ గుప్త గుమ్మడవెల్లి శ్రీనివాస్ మాశెట్టి వరప్రసాద్ కాజా వెంకటేశ్వర్లు వందనపు సామ్రాట్ గుప్తా పులిపాటి నగర్ ప్రాంతవాసులు పాల్గొన్నారు.

