జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్

జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు

అరైన్” “ఎలైవ్” సురక్షిత గమ్యం నినాదంతో రోడ్డు భద్రత అవగాహన

ప్రభుత్వ ఉద్యోగులకు

ప్రత్యేక అవగాహన

హెల్మెట్ సీటుబెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి

మద్యం సేవించి డ్రైవింగ్ మొబైల్ వినియోగం ప్రాణాంతకం

నాగారం ఎస్సై ఎస్. చిరంజీవి

నాగారం, అక్షిత న్యూస్ :

జాగ్రత్తలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవాలని లక్ష్యంతో పోలీసు శాఖ రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు నాగారం ఎస్సై ఎస్. చిరంజీవి స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదని సంకల్పంతో “అరైన్, ఎలైవ్” “సురక్షిత గమ్యం” నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్తూ మండల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో, మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా రోడ్డు పాదరతపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, వేగం, నిబంధనలో పాటించకపోవడం వల్ల జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని, ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఉద్యోగులు రోడ్డు పదార్థ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, తద్వారా సమాజానికి మంచి సందేశం వెళ్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ కట్టుకోవాలని సూచించారు. అలాగే డిఫెన్స్ డ్రైవింగ్ పద్ధతిని అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు అని, ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తూ, రోడ్డును సక్రమంగా వినియోగిస్తూ క్రమ పద్ధతిలో వాహనాలు నడపాలని తెలిపారు. ముందుగా ఇండికేటర్లు ఉపయోగిస్తూ, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణించడం ఎంతో ముఖ్యమని అన్నారు. అలాగే అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి చర్యలు ప్రాణాంతకం అని హెచ్చరించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పోలీస్శాఖతో పాటు ప్రజలు కూడా సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ హరికిషోర్ శర్మ, మండల వైద్యాధికారి యలగందుల నాగరాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking