విదేశీ చదువుకు  సైన్‌అప్ దిక్సూచి

విదేశీ చదువుకు

సైన్‌అప్ దిక్సూచి

యువతకు అండగా
   సైన్‌అప్ కన్సల్టెన్సీ

ఉన్నత విద్యతో
  ఉజ్వల భవిష్యత్తు

ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

యువత భవితకు సైన్‌అప్ కన్సల్టెన్సీ అండగా నిలుస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అన్నారు. ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు సైన్ అప్ కన్సల్టెన్సీ తోడుంటుందని ఆయన చెప్పారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సైన్‌అప్ కన్సల్టెన్సీ 2026 క్యాలెండర్‌ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, సైన్‌అప్ కన్సల్టెన్సీతో విదేశాల్లో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో విద్యార్థులకు చక్కటి దిక్సూచిలా నిలుస్తుందన్నారు.మెరుగైన మార్గదర్శకత్వం అందిస్తూ వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యా రంగంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతూ, యువతకు ఉత్తమ అవకాశాలు కల్పించాలని కోరుతూ సైన్‌అప్ కన్సల్టెన్సీకి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, కోదాడ, ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బ్రాంచీలతో సైన్ అప్ సేవలు అందించడం అభినందనీయమన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking