విద్యకు దిశానిర్దేశం భవితకు బలమైన పునాది

విద్యకు దిశానిర్దేశం
భవితకు బలమైన పునాది

ఎమ్మెల్సీ కేతావత్
శంకర్ నాయక్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడలో సైన్‌అప్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీలను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్‌అప్ కన్సల్టెన్సీ విద్యార్థుల కలలను సాకారం చేసే దిశగా నిరంతరం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన సలహాలతో యువతను ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న సంస్థ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సైన్‌అప్ కన్సల్టెన్సీ బృందానికి తన అమూల్యమైన ఆశీర్వాదాలు అందజేస్తూ, విద్యా రంగంలో సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా సైన్‌అప్ కన్సల్టెన్సీకి లభించిన ప్రోత్సాహం సంస్థకు మరింత శక్తిని ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking