పిల్లలకు చదువుతో పాటు పౌష్టికాహారం..

అంగన్వాడీల ద్వారా పిల్లలకు చదువుతో పాటు పౌష్టికాహారం..

సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్

కొండపాక, అక్షిత ప్రతినిధి:

కొండపాక మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం రెండవ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ రాధ నిర్వహించిన అన్న ప్రాసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని 0 -6 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర్ బాలికలు తప్పకుండా అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలని కోరారు. అంగన్వాడీలో పిల్లలకు ఆటపాటలతో కూడిన చదువుతోపాటు, పౌష్టికాహారం, పిల్లలకు ఇమ్మ్యూనైజేషన్ కార్యక్రమం ద్వారా సరైన సమయంలో టీకాలు వేయించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది అన్నారు. అన్నప్రాసన కార్యక్రమంలో భాగంగా ఆరు నెలలు నిండిన పాపకి బాలామృతంతో తయారు చేయబడిన ఆహారాన్ని సర్పంచ్ తినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్నమని, నరసింహ చారి, హై స్కూల్ ఉపాధ్యాయులు, వార్డ్ సభ్యులు మల్లమారి జ్యోతి సంజీవ్, గద్దె రాజు, కుమ్మరి ఎల్లం, తుమ్మ నాగయ్య, వడ్ల సుజాత, ఘనమైన లక్ష్మణ్ గౌడ్, భూపాల్ రెడ్డి, ఏఎన్ఎం శ్యామల, ఆశ కవిత, ఆయా అంజమ్మ గర్భవతులు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking