రోడ్డు భద్రతకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

  • రోడ్డు భద్రతకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • విద్యాసంస్థలు పిల్లల భద్రతకు అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి
  • సాంకేతిక లోపాలు ఉన్న ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను అనుమతించవద్దు
  • రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ అధికారులు చేపడుతున్న చర్యలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, అక్షిత బ్యూరో: విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని విద్యాసంస్ధలు రవాణా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపడుతున్న చర్యలపై రవాణా శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రతా మాసం–2026లో భాగంగా రవాణా శాఖ హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జి సురేష్ రెడ్డి, రవాణాశాఖ కమిషనరేట్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ అఫ్రిన్ సిద్ధిఖీ లు కలెక్టర్ కు రోడ్డు భద్రతా కార్యక్రమాలపై వివరాలు కలెక్టర్ కు సమర్పించారు. ఇటీవల పెనుబల్లిలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులు తప్పనిసరిగా రీ–ఇన్‌స్పెక్షన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొత్తం 764 విద్యాసంస్థల బస్సుల రీ–ఇన్‌స్పెక్షన్ చేపట్టామని సత్తుపల్లి యూనిట్ కార్యాలయం పరిధిలో 153 బస్సులకు గాను 146 బస్సుల రీ–ఇన్‌స్పెక్షన్ పూర్తి చేశామని వైరా యూనిట్ కార్యాలయం పరిధిలో.

135 బస్సుల్లో 133 బస్సుల తనిఖీలు పూర్తి కాగా ఒక బస్సు మరమ్మతుల కారణంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఖమ్మం పరిధిలో.

484 బస్సుల్లో 320 బస్సుల రీ–ఇన్‌స్పెక్షన్ పూర్తయినట్లు మిగిలిన 120 బస్సుల పరిశీలనను త్వరలో పూర్తిచేయనున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. కొన్ని బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోవడం ఇంజిన్ సమస్యలు వాహన వినియోగంలో లేనివిగా గుర్తించడంతో సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పిల్లల ప్రాణ భద్రత అత్యంత ముఖ్యమైనది, విద్యాసంస్థల బస్సులు రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రవాణా శాఖ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను కొనసాగిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఇటీవల జరిగిన పాఠశాల బస్సు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక రీ–ఇన్‌స్పెక్షన్ చేపట్టామని అన్నారు. లోపాలు గుర్తించిన వాహన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి లోపాలు సరిచేసే వరకు బస్సులను అనుమతించమని తెలిపారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని. విద్యాసంస్థల యాజమాన్యాలు డ్రైవర్లు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత విషయంలో జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను కొనసాగిస్తుందని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి జగదీష్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ అధికారులు తదితరులు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking