బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్
వరంగల్, అక్షిత బ్యూరో:
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్ స్పెక్టర్లుగా విధులు నిర్వహిస్తూ సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన వేణుగోపాల్ రెడ్డి, రాజేందర్, పర్వీన్ లు సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులను సమర్ధవంతంగా పనిచేస్తూ బాధితులకు న్యాయం చేయాలని సీపీ పేర్కొన్నారు