బాల్యం బందీ అవ్వొద్దు
బడి వయస్సులో
బడిలోనే ఉండాలి
ఆపరేషన్ స్మైల్
బాల కార్మికులకు విముక్తి
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ టౌన్, అక్షిత న్యూస్ :
ఆపరేషన్ స్మైల్ ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించిన నల్లగొండ పోలీసు శాఖ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. ఒక్క జనవరి నెలలో 92 కేసులలో 118 మంది బాల కార్మికుల రెస్క్యూ. కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగింత పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను వెట్టిచాకిరీతోనే బంధీ అయిపోతున్న పసిబాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేసింది నల్లగొండ జిల్లా పోలీసు. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. ఏంకంగా 118 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాలకార్మికులు, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పని చేసే వారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ రమేష్, పోలీస్ శాఖ ఏ.హెచ్.టి.యు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారుల సమన్వయంతో టీమ్ లుగా ఏర్పడి ఒక్క జనవరి నెలలోనే 92 కేసుల్లో 118 మంది పిల్లలను రెస్యూ చేయడం వీరిలో 105 మంది బాలలు 13 మంది బాలికలు వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలు బీహార్, చత్తీస్గడ్, ఒరిస్సా, యూపీ మరియు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం. బాల కార్మికులకు చేత పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పువు జిల్లా ఎస్పీ, జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని అన్నారు. బాల కార్మికులకు చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్- 100 లేదా 1098 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ ఆపరేషన్ స్మైల్ లో భాగంగా నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బాలకార్మికులు రెస్క్యూ చేసి కాపాడిన ఏ హెచ్ టియు సిబ్బంది మరియు సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్ ప్రకటించారు.