పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ చేయూత
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్ధుల ఉన్నతవిద్యకు ఆర్ధిక సమస్య అడ్డుకారాదనే ఆశయంతో పరిశసీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ (సిఎ) చదువుతున్న విద్యార్ధినికి అండగానిలిచింది. ఖమ్మం ముస్తఫానగర్ కు చెందిన తీర్ధాల స్పందన ప్రతిభతో పదవతరగతి ఇంటర్ పూర్తి చేసి సిఏ చేయాలనే తన లక్ష్యం తో చేరినప్పటికి కుటుంబం ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నది. తమ కుమార్తె ఉన్నతవిద్యకు చేయూత అందించాలని కుటుంబ సభ్యులు ట్రస్ట్ సభ్యులను సంప్రదించగా చేయూత చేస్తామని హామీ ఇచ్చారు. తీర్ధాల స్పందన కుటుంబ సభ్యులకు ఇచ్చిన హామీమేరకు ట్రస్ట్ సభ్యులు మహంకాళి స్వరాజ్యలక్ష్మి మురళీకృష్ణ దంపతుల ఆర్ధిక సౌజన్యంతో ఇరవైవేల రూపాయలు చెక్కును ట్రస్ట్ చైర్మన్ పరిశపుల్లయ్య విద్యార్ధినికి అందించారు. కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు మహంకాళి స్వరాజ్యలక్ష్మి, పరిశలక్ష్మరాజ్యం గొండేల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.