కాలనీ భద్రతకు సీసీ కెమెరాల కీలక పాత్ర : ఎమ్మెల్యే వివేకానంద్
రూ.4.50 లక్షలతో పద్మనగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు
అక్షిత న్యూస్ / గాజులరామారం : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ 131 పరిధిలోని పద్మనగర్ ఫేస్1 కాలనీలో సుమారు రూ.4.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీవాసులకు మౌలిక వసతుల కల్పనతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన సంక్షేమ సంఘం సభ్యులను అభినందించారు.

సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కాలనీ మొత్తం నిఘా నీడలోకి వచ్చి, నేరాల నియంత్రణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ప్రజల ఐకమత్యం ఎంతో అవసరమని, సంక్షేమ సంఘం సభ్యులకు కాలనీవాసులు మద్దతుగా నిలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన తెలిపారు.

ప్రజల సహకారంతోనే సురక్షితమైన, అభివృద్ధి చెందిన కాలనీలను నిర్మించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్, ఎస్సై ఏ. వినోద్ కుమార్, వాటర్ వర్క్స్ ఏఈ రవి, కాలనీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, కోశాధికారి ప్రసాద్ రావు, సలహాదారులు ముత్యాలు, శివనాగిరెడ్డి, జయసింహారెడ్డి, కాసింపిరా తదితరులు పాల్గొన్నారు.