పక్కగా జలవనరుల గణన

పక్కగా జలవనరుల గణన

7 లోగా పూర్తి చేయాలి

కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ టౌన్, అక్షిత న్యూస్ :

ఫిబ్రవరి 7లోగా అన్ని ఇరిగేషన్ వాటర్ బాడీస్ గణన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు .సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 7వ చిన్న నీటిపారుదల గణన, 2వ జలవనరుల గణనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న 7వ చిన్న నీటిపారుదల గణన, 2వ జలవనరుల గణనతో పాటు సెవెంత్ మేజర్ ఇరిగేషన్ వాటర్ బాడీస్‌కు సంబంధించిన గణన పనులు ఎక్కడా పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, అలాగే మేజర్ ఇరిగేషన్ కింద ఉన్న నీటి వనరులు, బోర్లు, బావులకు సంబంధించిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు.

గణన ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరగకుండా శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని, ప్రతి వాటర్ బాడీ వివరాలు పూర్తిగా నమోదు చేసి ఫిబ్రవరి 7, 2026లోగా గణనను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ గణన ద్వారా జిల్లాలోని నీటి వనరుల వాస్తవ స్థితిగతులు వెలుగులోకి వస్తాయని, భవిష్యత్తులో సాగునీటి ప్రణాళికలు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ఇది బలమైన ఆధారంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులు, గణన సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి. ఇరిగేషన్, వ్యవసాయ,రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, తహసిల్దార్ ఏఈఓస్ జిపిఓస్ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ సెక్రెటరీ టెక్నికల్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking