28వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

28వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

ఆశీర్వదించండి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి
తోట జ్యోతి శ్రీనివాస్

కోదాడ, అక్షిత ప్రతినిధి :

28వ వార్డు లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం కౌన్సిలర్ అభ్యర్థి తోట జ్యోతి శ్రీనివాస్ చేపట్టారు వార్డులో గడపగడపకు తిరుగుతూ ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తానని తెలిపారు.

28 వార్డ్ లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలను వార్డు పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్ ,నూతన సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి వార్డు నీ అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తోట ధనమూర్తి, కంబాల వీరబాబు, బండ్ల దాసు, కొమ్ము వెంకటేశ్వర్లు,, మహేష్ మామిడి పవన్, ఇటుకల నరసింహారావు, చింతల గోపి , నాగమణి ,చింతల వెంకట్, నరసింహ చింతా శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking