నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
వివాహ బంధం రెండు కుటుంబాలను కలిపే పవిత్రమైన బంధం
పరస్పర నమ్మకం గౌరవంతో దాంపత్య జీవితం విజయవంతం అవుతుంది
పెద్దల ఆశీస్సులతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్ష
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్
నాగారం, అక్షిత న్యూస్ :
మండల పరిధిలోని పసునూరు గ్రామంలో మైదం నారాయణ కుమారుడు మైదం మహేష్ ప్రణవి వివాహ రిసెప్షన్ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సంతోషకరమైన కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ముందుగా వధూవరులను అభినందిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని, పరస్పర సహకారం, పరస్పర గౌరవంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కూడా కలిపే పవిత్రమైన బంధం అని తెలిపారు. దాంపత్య జీవితం పరస్పర నమ్మకం, సహనం, ప్రేమ, పరస్పర గౌరవం వంటి విలువలపై ఆధారపడి సాఫల్యంగా సాగుతుందని అన్నారు. కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానం కలిగి ఉందని, పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల మద్దతుతో నూతన దంపతులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి విలువలను నిలబెట్టే కుటుంబాల నిర్మాణం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులకు పూలమాలలు అందజేసి, శుభాకాంక్షలు తెలుపుతూ వారి దాంపత్య జీవితం ఆనందంగా, సంతోషంగా కొనసాగాలని ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆదిత్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా పలకరించి సత్కరించగా కార్యక్రమం ఎంతో ఆనందకరంగా, స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది. నూతన దంపతులు మైదం మహేష్- ప్రణవి జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం నెలకొనాలని కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పొదిల రమేష్ గౌడ్, లక్ష్మాపురం మాజీ సర్పంచ్ కుంటపెల్లి సుధాకర్, మండల, గ్రామ బిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.