అక్రమ నిర్మాణాలకు అడ్డేది?

అక్రమ నిర్మాణాలకు అడ్డేది?

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు..

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమనిర్మాణాలపై పట్టింపు లేనట్టేనా..?

దుండిగల్ సర్కిల్లో పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు..

అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో బయటపడ్డ టౌన్ ప్లానింగ్ అవినీతి బాగోతం అయినా తీరు మారని అధికారులు..

ఏసీపీ కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలంటూ విమర్శల వెల్లువ..

మేడ్చల్, అక్షిత బ్యూరో :

కంచె చేను మేసేలా ఉంది.కాపాడాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమార్కులకు రక్షణ కవచంలా ఉంటుండ్రు.దుండిగల్ జిహెచ్ఎంసి సర్కిల్ లో ఇబ్బడి ముబ్బడిగా పుట్టగొడుగుల్లాగా నిర్మాణాలు వెలుస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం కన్నెత్తి చూడడం లేదు. అటువైపు ముడుపులతో సరిపెడుతున్నట్లేనా..? అని పలు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి అధికారుల,పై దుండిగల్ సర్కిల్లో ఆరు గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా,సాగుతున్నాయి, అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నా, ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మారడం లేదు. పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడంలేదు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలంటూ విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టెక్ మహీంద్రా ఎదురుగా భారీగా అక్రమ నిర్మాణం, గాగిల్లపూర్ లో భారీ బహుళ అంతస్తుల భవనం, ఎంఎల్ఆర్ఐటి కళాశాల నాలాపై బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు.జి ప్లస్ 3 అనుమతులతో జి ప్లస్ 5 నిర్మాణాలు సాగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎసిబి దాడుల్లో బయటపడ్డ అక్రమాలు..

దుండిగల్ సర్కిల్ లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అక్రమాలపై నిగ్గుతేల్చారు,గత నెల 18వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు టిపిఎస్ తోపాటు పలువురు అధికారులు,సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారించారు,సర్కిల్ అధికారులకు జి ప్లస్ 3 వరకే అనుమతి ఇవ్వాల్సి ఉండగా టీడీఆర్ ముసుగులో జి ప్లస్ 5 వరకు అనుమతులు ఇచ్చి కోట్ల రూపాయలు అడ్డగోలుగా దండుకున్నట్లు తేల్చారు.

మారని అధికారుల తీరు..

అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి టౌన్ ప్లానింగ్ లో అక్రమాలు జరిగినట్లు తేల్చినా అసిస్టెంట్ సిటీ ప్లానర్ తీరుమాయడంలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.28 భవనాలకు రెండవ నోటీస్ అవ్వకుండా నిర్లక్ష్యం వహించగా,49 నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారని,12 దారకాస్తులు డగువు తీరిన పరిష్కరించలేదని భారీ కుంభకోణానానికి పాల్పడ్డారని తేల్చారు,ఎసిబి దాడులు జరిగి 15 రోజులు దాటినా దారకాస్తులు పరిష్కరించడంలో ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.ఎసిబి దాడులు జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకట్టపడంలేదు.అసిస్టెంట్ సిటీ ప్లానర్ కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణదారుల్లో టెన్షన్..

దుండిగల్ సర్కిల్ లో ఎసిబి దాడులతో అక్రమ నిర్మాణదారుల్లో టెన్షన్ మొదలయ్యింది,ఎసిబి దాడుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు బయట పడడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం, లక్ష్యల రూపాయలు వెచ్చించి అనుమతులు పొందిన నిర్మాణదారులు ఇటీవల నిబంధనలు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు క్యాన్సల్ అయ్యేఅవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండటంతో అక్రమ నిర్మాణదారుల్లో టెన్షన్ మొదలయ్యింది..

Leave A Reply

Your email address will not be published.

Breaking